18, నవంబర్ 2008, మంగళవారం

జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ
జయ జయ సశ్యామల సు
శ్యామ చల చ్చేలాంచల !
జయవసంత కుసుమలతా
చలిత లలిత చూర్ణ కుంతల
జయమదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా //జయ జయ జయ ప్రియ భారత//

జయదిశంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయగాయక వైతాళిక
గళవిశాల పద విహరణ
జయమదీయ మధురగేయ
చుంబిత సుందరచరణా //జయ జయ జయ ప్రియ భారత//

6, నవంబర్ 2008, గురువారం

వందనం,వందనం

వందనం,,వందనం గిరినందినీ ప్రియ నందనా
వందనం కరివదనకరుణా
శరణు నీ పద కమలములకడ //వందనం//

వందనం ముని బృంద హ్రుదయ స్యందనా
వెన్నవలె, వెన్నెలలవలె,క్రొన్ననలవలె
మెత్తనిదినీమది

దాతవని శుభ దాతవని,
మా
బ్రతుకునేలే నేతవని విని//వందనం//
అయ్యా కడ ఐశ్య్వర్యమడిగీ
అమ్మకడ సౌభగ్యమడిగీ

నెయ్యమున నీ చరణ దాసుల
కీయవా
దేవాధి దేవా/వందనం//

వందనం,వందనం గిరినందినీ ప్రియ నందనా
వందనం కరివదనకరుణా
శరణు నీ పద కమలములకడ //వందనం//

వందనం ముని బృంద
హ్రుదయ
స్యందనా
వెన్నవలె, వెన్నెలలవలె,క్రొన్ననలవలె
మెత్తనిదినీమది
దాతవని శుభ దాతవని,
మా
బ్రతుకునేలే నేతవని విని//వందనం//

అయ్య కడ ఐశ్వర్యమడిగీ
అమ్మకడ సౌభగ్యమడిగీ
నెయ్యమున నీ చరణ దాసుల
కీయవా
దేవాది దేవా/వందనం//