10, అక్టోబర్ 2008, శుక్రవారం

వందనాలూవందనాలూ

వందనాలు వందనాలూ వందనాలూవందనాలూ
అందమైన భరతాంబకు
వందనాలూవందనాలూ

మహిమలతో వెలసినావు
మహిని పేరు బడసినావు
మా ప్రాణము మామానము
మాకు నీవె మా భారతి
వందనాలూవందనాలూ

జయ ధ్వజము నేగిరింతుము

జగతి యందు విహరింతుము
శత్రువు లెదురైన చీల్చి
చెందడగా పోరుతాము //
వందనాలూవందనాలూ//

నీ కోసము జీవింతుము
నీ కోసము మరణిన్తుము

నీ కోసము ఆజీవన మింపారగ
కష్టింతుము
//వందనాలూవందనాలూ//

దండాలు దండాలు రచన శ్రీ.గరిమెళ్ళ సత్యనారయణ గారు

దండాలుదండాలు భారతమాతా
నీ వందుకోని జీవించూ భారత మాతా 2సార్లు.
మూదు వందలేంద్ల కింద భారత మాతా
అల ముంచినోదు దిగినాదే భారత మాతా
ముంచినోదు దిగినాకా భారత మాతా
మా కొంపలన్ని కూలిన యే భారత మాతా // దండాలు దండాలు //
వర్తకాని కంటు వచ్చి భారత మాతా
ఆడు పెత్తనమూ చెసినడే భారత మాతా
సివరికి రాజ్యాలు సెసినడే భారత మాతా
ఆడి జూలె నింపుకున్నడె భారత మాతా// దండాలు దండాలు
ఈత చెట్ల నన్నిటినీ భారత మాతా
ఆడి తాత గాడు పాతినాడా భారత మాతా
మా రాజని మొరబెదితే భారత మాతా
మరి రెందు తన్నమన్నాడే భారత మాతా// దండాలు దండాలు //

గాంధీ మహాత్ము డూ భారతమాతా
నీ ముద్దు కొడుకు ఉండంగా భారతమాతా
కన్నిరూ నీకేలా భారతమాతా
మా కున్న kaStamulu
తీరూ
భారతమాతా