25, డిసెంబర్ 2008, గురువారం

జయము జయముతల్లీ

జయము జయముతల్లీ
జయము కల్పవల్లీ
పరిమళాల బ్రతుకుపూలు
పచరించుము నీదుపూజ // జయము//

గంగాదినదీజలాల
పొంగారెడు జీవనాలు
రంగారెడు నందనమ్ము
బంగారము పండుఫలము//జయము//

వేళ యేండ్లు మనిన వెలుగు
బాలబాలికలకు తొడుగ
ఆశయాల కొసలు తాక
అందరకొక జయపతాక//జయము//

ఆటపాట బ్రతుకుపాట
అన్నింటికి మారుతోట
ఆరతిత్తు నీపదాల
అర్పింతుము వందనమ్ము//జయము//






3, డిసెంబర్ 2008, బుధవారం

ఈ లోకం లొ

ఈలోకం లొ, నా దేశం లో
నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //
ఈలోకం లొ//

సంసారం సాగరమైతే
జలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం //
ఈలోకం లొ//

పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //
ఈలోకం లొ//

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి
బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //
ఈలోకం లొ//

( పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )