జయము కల్పవల్లీ
పరిమళాల బ్రతుకుపూలుపచరించుము నీదుపూజ // జయము//
గంగాదినదీజలాల
పొంగారెడు జీవనాలు
రంగారెడు నందనమ్ము
బంగారము పండుఫలము//జయము//
వేళ యేండ్లు మనిన వెలుగు
బాలబాలికలకు తొడుగ
ఆశయాల కొసలు తాక
అందరకొక జయపతాక//జయము//
ఆటపాట బ్రతుకుపాట
అన్నింటికి మారుతోట
ఆరతిత్తు నీపదాల
అర్పింతుము వందనమ్ము//జయము//